Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి అద్బుత విజయంపై ఇప్పటికీ దిమ్మదిరుగుతూనే ఉన్న బాలీవుడ్.. 1500 కోట్లు లెక్కే కాదంటున్న అనిల్ శర్మ

విడుదలైన 25 రోజులకు కూడా బాహుబలి సాదిస్తున్న కలెక్ష్లన్లపై బాలీవుడ్ ప్రముఖులకు దిమ్మ తిరుగతూనే ఉన్నట్లుంది. తాజాగా ఈ కోవలోకి వచ్చినవాడు అనిల్ శర్మ, 16 ఏళ్ల క్రితం ఆయన తీసిన గదర్‌ సినిమా అప్పుడే 265 కోట్ల బిజినెస్‌ చేసిందట. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుక

Webdunia
బుధవారం, 24 మే 2017 (04:54 IST)
భారతీయ చలనచిత్ర యవనికపై బాహుబలి2 సాధించిన విజయం ఇప్పటికీ బాలీవుడ్‌కి మింగుడు పడుతున్నట్లు లేదు. విడుదలైన 25 రోజులకు కూడా బాహుబలి సాదిస్తున్న కలెక్ష్లన్లపై బాలీవుడ్ ప్రముఖులకు దిమ్మ తిరుగతూనే ఉన్నట్లుంది. తాజాగా ఈ కోవలోకి వచ్చినవాడు అనిల్ శర్మ, 16 ఏళ్ల క్రితం ఆయన తీసిన గదర్‌ సినిమా అప్పుడే 265 కోట్ల బిజినెస్‌ చేసిందట. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే దాని విలువ దాదాపు రూ. 5000 కోట్ల వరకు ఉంటుందని, అందువల్ల ఇప్పటివరకు బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టినట్లేమీ కాదని కుళ్లు వాగుడు వాగేశారు.
 
ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2 సినిమా రూ. 1500 కోట్ల వసూళ్లు సాధించినా, బాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు అనిల్‌ శర్మకు మాత్రం అది పెద్ద గొప్ప లెక్కలా ఏమీ కనిపించడం లేదు. 2001లో వచ్చిన గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ, 2007 నాటి అప్నే, 2010 నాటి వీర్‌, 2013 నాటి సింగ్‌ సాబ్‌ ద గ్రేట్‌ లాంటి సినిమాలు ఆయనే తీశారు. అయితే, ఇటీవల బాహుబలి-2 సినిమా బాక్సాఫీసు వసూళ్ల గురించి ఆయన దగ్గర మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన తేలిగ్గా కొట్టి పారేశారు. 
 
సన్నీ డియోల్‌తో తాను తీసిన గదర్‌ సినిమాతో పోలిస్తే ఇవి పెద్ద వసూళ్లే కావని ఆయన వ్యాఖ్యానించారు. కాకపోతే అప్పటి కాలం, అప్పటి టికెట్‌ ధరలు, నాటి డబ్బు విలువ అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దాదాపు 16 ఏళ్ల క్రితం ఆయన తీసిన గదర్‌ సినిమా అప్పుడే 265 కోట్ల బిజినెస్‌ చేసింది. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే దాని విలువ దాదాపు రూ. 5000 కోట్ల వరకు ఉంటుందని ఆయన అన్నారు. గదర్‌ సినిమా వచ్చినప్పుడు టికెట్‌ ధర కేవలం రూ. 25 మాత్రమే ఉండేదని, ఆ లెక్కన ఇప్పటి టికెట్‌ ధరలు, ద్రవ్యోల్బణం కలిపి లెక్కేసుకుంటే అప్పటి రూ. 265 కోట్లు ఇప్పటికి రూ. 5000 కోట్ల లెక్క అవుతుందని ఆయన వివరించారు. 
 
అందువల్ల ఇప్పటివరకు బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టినట్లేమీ కాదని తేల్చి చెప్పేశారు. మంచి సినిమాలు ఎప్పుడూ రికార్డులను బద్దలుకొడతాయని, అయితే బాహుబలి2 మాత్రం ఎలాంటి రికార్డులూ బద్దలుకొట్టలేదని అనిల్‌ శర్మ అన్నారు. తనను ఈ విషయాలన్నింటిలో ఇరికించవద్దని, మంచి సినిమాలు వస్తే రికార్డులు ఆటోమేటిగ్గా బద్దలవుతాయని తెలిపారు.
 
కాగా ఇప్పటివరకు బాహుబలి-2 హిందీ వెర్షన్‌కు రూ. 478 కోట్ల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ విడుదల చేసిన ఈ సినిమా ఆమిర్‌ ఖాన్‌ తీసిన దంగల్‌ కంటే బాలీవుడ్‌లో ఎక్కువ వసూళ్లు సాధించింది.
 
 taran adarsh ✔ @taran_adarsh
#Dangal and #Baahubali2 are akin to WAKE-UP CALL for Indian film industry... The global biz is an EYE-OPENER... Game changers, both...
 
 taran adarsh ✔ @taran_adarsh
The resounding success of #Baahubali2 and #Dangal globally reiterates the fact that language is no deterrent if content is strong enough...
 
 taran adarsh ✔ @taran_adarsh
The industry yearns for Hits... #Dangal and #Baahubali2 have achieved what we thought was IMPOSSIBLE and UNACHIEVABLE... Time to rejoice...
 
 taran adarsh ✔ @taran_adarsh
#Baahubali2 and #Dangal are PRIDE OF INDIAN CINEMA... Time to make success a habit... Concentrate on content... Positive results will follow
 
 taran adarsh ✔ @taran_adarsh
Indeed, #Baahubali2 has emerged the HIGHEST GROSSER EVER... Yeh jo public hain yeh sab jaanti hain... Audience knows it all! httpstwitter.comtaran_adarshstatus856383419885826048 …
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments