రూ. 350 కోట్ల దిశగా పరుగు తీస్తున్న హిందీ బాహుబలి-2.. నిజంగా గేమ్ చేంజర్ అంటున్న తరణ్ ఆదర్స్
ఎవరేమనుకున్నా సరే... బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ లాగా బాహుబలి-2 సినిమాను ఆకాశానికి ఎత్తివేస్తున్న వారు భారతీయ చిత్రపరిశ్రమలోనే ఎవరూ లేరు. బాహుబలి-2 సినిమా ఇక బద్దలు కొట్టాల్సిన రికార్డులంటూ ఏవీ లేవంటూ తరణ్ వ్యాఖ్యానించారు. సినిమా బాహుబలి-2
ఎవరేమనుకున్నా సరే... బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ లాగా బాహుబలి-2 సినిమాను ఆకాశానికి ఎత్తివేస్తున్న వారు భారతీయ చిత్రపరిశ్రమలోనే ఎవరూ లేరు. బాహుబలి-2 సినిమా ఇక బద్దలు కొట్టాల్సిన రికార్డులంటూ ఏవీ లేవంటూ తరణ్ వ్యాఖ్యానించారు. సినిమా బాహుబలి-2 హిందీ వెర్షన్ 11 రోజుల్లో 300 కోట్ల రూపాయలపైగా నెట్ వసూళ్లు చేయడమే కాదు.. ఇప్పుడు 350 కోట్ల రూపాయల దశగా పరుగులు పెడుతోండటమే తరణ్ ఆదర్శ్‌ను పొంగిపోయేలా చేస్తోంది.
ఇప్పటికే బాహుబలి 2 సినిమా చాలా రికార్డులు బద్దలు కొట్టిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. బాహుబలి-2 సినిమా భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించినంతవరకు నిజంగా ఒక గేమ్ ఛేంజర్ అంటూ తరణ్ ప్రశంసించారు. ఫాస్టెస్ట్ 50 కోట్లు, ఫాస్టెస్ట్ 100 కోట్లు, ఫాస్టెస్ట్ 150 కోట్లు, ఫాస్టెస్ట్ 200 కోట్లు, ఫాస్టెస్ట్ 250 కోట్లు, ఫాస్టెస్ట్ 300 కోట్లు... వీటన్నింటినీ బాహుబలి-2 ఇప్పటికే దాటేసిందని, ఇప్పుడు రూ. 350 కోట్ల వైపు వెళ్తోందని చెప్పారు.
హిందీలోకి డబ్ అయిన ఒక తెలుగు సినిమా సృష్టిస్తున్న సంచలనం చూసి మార్కెట్ వర్గాలతో పాటు విమర్శకులు కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. కానీ జాతీయ మీడియాలోని ఒక వర్గం 'డియర్ బాహుబలి.. దంగల్ పని ఇంకా అయిపోలేదు, కలెక్షన్లు వస్తున్నాయి' అంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా బాహుబలి వసూళ్లను దాటి వెళ్తుందన్న ఉద్దేశంలో అలా రాశారు.
ఉత్తరాదిలో మాత్రం కొందరు దక్షిణాది సినిమా ఇంతలా విజయం సాధించడం ఏంటన్న భావనలోనే ఉన్నట్లుంది.