Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కు జోడీగా వారిద్దరే సరి.. బాహుబలి ఎత్తుకు తగిన.. కత్తిలా వుంటారు..

బాహుబలి సినిమాతో తన రేంజ్‌ను అమాంతం పెంచుకున్న ప్రభాస్.. తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. సాహో సినిమానే కాకుండా ఇకపై ప్రభాస్ నటించే సినిమాలు తెలు

Webdunia
మంగళవారం, 9 మే 2017 (18:00 IST)
బాహుబలి సినిమాతో తన రేంజ్‌ను అమాంతం పెంచుకున్న ప్రభాస్.. తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. సాహో సినిమానే కాకుండా ఇకపై ప్రభాస్ నటించే సినిమాలు తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సాహో సినీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

రూ.150కోట్లతో భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం సుజిత్ వేట మొదలెట్టాడు. సుజిత్ హీరోయిన్ కోసం వేట ప్రారంభించాడని తెలిసి.. అప్పుడే సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభాస్‌కు తగిన మ్యాచ్‌ను పోస్ట్ చేసేశారు. ప్రభాస్ పక్కన కత్తిలా కనిపించాలంటే.. అనుష్కతో పాటు బాలీవుడ్ హీరోయిన్ కత్రినానే కరెక్ట్ అంటున్నారు. నెటిజన్లు వీరిద్దరు అయితేనే బాహుబలి ఎత్తుకు తగినట్లు.. కత్తిలా ఉంటారని అభిప్రాయ పడుతున్నారు. 
 
ప్ర‌భాస్ ప‌క్క‌న హీరోయిన్‌గా ఎవ‌రు బాగుంటార‌ని ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ అభిమానులను ప్రశ్నించడంతో అనేకమంది కత్రీనాకు.. మరికొందరు అనుష్కకు ఓటేశారు. మరికొందరు దీపికా పదుకునే కూడా బాగుంటుందని కామెంట్స్ చేశారు. కాగా బాహుబలిలో అమరేంద్ర బాహుబలిగా దేవసేన మెచ్చిన ప్రభాస్‌కు ఆరువేల పెళ్లి  ప్రపోజల్స్ వచ్చాయి. ఆయన్ని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు వెంటపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాతో ప్రభాస్‌తో జతకట్టేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సైతం సై అంటున్నారు. ఈ క్రమంలో కత్రినా మాత్రం కాదంటుందా? ఏంటి?
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments