Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామీణ కుర్రాడి ఆశ, ఆశయాలతో ఏవమ్ జగత్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (18:46 IST)
Avam Jagat poster
ప్రేక్షకులు నచ్చే, మెచ్చే కథను వెండితెరపై ఆవిష్కృతం చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు కొంద‌రు. అలాంటి కోవలోకి చెందిన కొత్త సినిమా 'ఏవమ్ జగత్'. ఓ విలేజ్ కుర్రాడి ఆశ, ఆశయాలను ప్రధాన భూమికగా తీసుకొని యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే వైవిద్యభరితమైన కథను 'ఏవమ్ జగత్' రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
 
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన తారాగణంగా ఈ 'ఏవమ్ జగత్' సినిమా రూపొందిస్తున్నారు. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి దినేష్ నర్రా దర్శకత్వం వహిస్తుండగా ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'ఏవమ్ జగత్' ట్రైలర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్.
 
2 నిమిషాల 58 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో ప్రతి సన్నివేశం కూడా ఆలోచింపజేసేలా ఉంది. పల్లెకు, పట్నానికి, యువత టాలెంట్‌కి లింక్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ పండించారు. ప్రతి ఫ్రేములో వచ్చే ఒక్కో డైలాగ్ యూత్ ఆడియన్స్‌‌కి బాగా కనెక్ట్ అవుతోంది. ఓ పల్లెటూరి యువకుడు చేసిన రీసెర్చ్, ఇన్నోవేషన్ థాట్‌ని చూపించిన విధానం హైలైట్ అవుతోంది. 'తెలివైన వాళ్లందరినీ పట్నాలకు తరిమేసే ఈ రోజు పల్లెటూళ్లన్నీ నాశనం అవుతున్నాయి' అనే డైలాగ్ నేటి పరిస్థితులకు అద్దంపడుతోంది. టెక్నాలజీ గురించి తెలియజేసే సన్నివేశాలు, పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల తీరును కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఎంతో ఆసక్తికరంగా ఈ ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ ఆధారంగా మొత్తంగా చెప్పాలంటే లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, విలేజ్ ఎఫెక్షన్, యూత్ టాలెంట్ తదితర అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
 
నటీనటులు - కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments