Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sai Tej: ఎక్సయిట్ చేసే కథలు వస్తేనే ఆడియన్స్ వస్తారు : సాయి దుర్గతేజ్

దేవీ
గురువారం, 18 సెప్టెంబరు 2025 (17:12 IST)
Sai Srinivas, Sai Durgatej, Anil Ravipudi, Bobby
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్  సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట,  అనుదీప్ అతిధులు గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
హీరో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ.. సాహు గారితో నాకు మంచి ఒక అనుబంధం ఉంది. సాహు గారి తమ్ముడు డిగ్రీలో నా క్లాస్ మేట్. ఆ బాండ్ అప్పటినుంచి ఉంది. సాయి తో నాకు ముంబైలో యాక్టింగ్ క్లాస్ నుంచి పరిచయం ఉంది. 15 ఏళ్లుగా మా జర్నీ కొనసాగుతోంది. ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం. ఈ స్టేజ్ నాకు ఒక రియూనియన్ లాగా ఉంది. నా టెన్త్ క్లాసు మేట్ వశిష్ట, కనిష్క కూడా నా క్లాస్ మేట్. అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చేతన్ భరద్వాజ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అనిల్ గారు నాకు ఎంతో సన్నిహితులు. మా మావయ్య గారితో చేస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సక్సెస్ మీట్ లో అందరూ నవ్వుకోవడం కూడా ఒక పెద్ద సక్సెస్. ఈ మూమెంట్ ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మొత్తం ఇండస్ట్రీ సక్సెస్ లాగా భావిస్తున్నాను. ఇండస్ట్రీ ఒక ఎవల్యూషన్ దశలో ఉంది. మంచి కథలు రావాలి. ఆడియన్స్ ని ఎక్సయిట్ చేసే కథలు రావాలి. అలా వస్తేనే ఆడియన్స్ కి వస్తారు. అలాంటి సినిమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిస్కింధపురి.. ఇలా అన్ని సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. మంచి కంటెంట్ ని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత మంచి హిట్ అందుకున్న కిస్కింధపురి టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సెప్టెంబర్ మంత్ థియేటర్స్ కి చాలా బావుంది.  అందరూ థియేటర్స్ కి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బాబీ అన్న అల్లుడు శీను సినిమాకి చాలా మంచి కథ ఇచ్చారు. అప్పుడు నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన మాకు బెస్ట్ విషెస్ అందించడానికి అందించినందుకు చాలా థాంక్స్. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి. ఇది మీ అందరిని అలరించే సినిమా. తేజ్ తో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన భైరవం సినిమా కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. మరింత సపోర్ట్ చేసే సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాపట్ల సూర్యలంక సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్.. సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు..

ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వెళుతూ మృత్యు ఒడికి చేరిన నవ వధువు

Yoga instructor : థాయ్‌లాండ్‌లో 17ఏళ్ల బాలికపై యోగా ఇన్‌స్ట్రక్టర్ లైంగిక దాడి.. అవన్నీ చెప్పి?

అమ్మ పొద్దస్తామనం చదువుకోమంటోంది... తల్లిపై పోలీసులకు కుమారుడు ఫిర్యాదు

Kerala: మైనర్ బాలుడిపై 14మంది వ్యక్తులు రెండేళ్ల పాటు అత్యాచారం.. ఆ యాప్‌ వల్లే అంతా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments