Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sushmita : భయ పెట్టడం కూడా ఒక ఆర్ట్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Advertiesment
Anil Ravipudi, Sai Srinivas, Anupama Parameswaran, Kaushik Pegallapati, Sushmita Konidela

దేవీ

, గురువారం, 11 సెప్టెంబరు 2025 (16:40 IST)
Anil Ravipudi, Sai Srinivas, Anupama Parameswaran, Kaushik Pegallapati, Sushmita Konidela
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులు హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుక జరిగింది.
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భయ పెట్టడం కూడా ఒక ఆర్ట్. ఈ సినిమాతో ఆడియన్స్ ని భయపెడతాం. ఆడియన్స్ కు ఒక మంచి విజువల్, సౌండ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఒక మంచి కథ చూశామనే  శాటిస్ఫాక్షన్ ఉంటుంది. అద్భుతమైన కథ చేసిన మా డైరెక్టర్ కౌశిక్ గారికి థాంక్యూ సో మచ్. కౌశిక్ ఈ సినిమాతో చాలా మంచివి స్థాయికి వెళ్తారు. చిన్మయి గ్రేట్ విజువల్స్ ఇచ్చారు. చైతన్ భరద్వాజ్ తన మ్యూజిక్ తో బద్దలు కొట్టేశారు. ఎన్నో కలల తోటి చాలా కష్టపడి ఒక సినిమా చేస్తాం. మా సినిమానే గూస్ బంప్. కిష్కింధపురి మీ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చూశాను. పది మంచి సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. అనుపమ నేను రాక్షసుడు తో మంచి హిట్ కొట్టాం. అందరూ రాక్షసుడు 2 ఎప్పుడు అని అడిగారు. కానీ దానికి మించిన సినిమా చేసాం. అదే కిస్కిందపురి. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల అయింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా గర్వంగా ఉంది. కొంచెం వెలితిగా కూడా ఉంది. అది కిష్కింధపురి తీరుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ... ఈ సినిమా ప్రమోషన్స్ తో కూడా భయపడుతున్నారు. నిర్మాత సాహు గారితో భగవంతుకేసరి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా ఆయన నిర్మాణంలోనే చేస్తున్నాను. మా సినిమా రిలీజ్ అయిన సక్సెస్ అయ్యే ముందే కిష్కింధపురి సినిమా హిట్ అయి నాకు మంచి గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
 
డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ... అందరికి నమస్కారం. సాహు గారు ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుతుంటారు. సాయి గారు సినిమా కోసం చాలా కష్టపడతారు. ఈ సినిమా రాక్షసుడులానే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అనుపమ గారు ఒక సినిమా ఒప్పుకున్నారంటే కచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుందని నమ్మకం. డైరెక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.  కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ముందే వచ్చేస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.  
 
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. సాయితో ఇది నా సెకండ్ ఫిలిం. మేము కలిసి చేసిన ఫస్ట్ సినిమా రాక్షసుడు చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో ఒక డిఫరెంట్ సాయి ని చూశారు. ఈ సినిమాలో కూడా అంత డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు.
 
ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ.. సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే షోస్ ముందే ప్లాన్ చేస్తున్నాం. మాతో పాటు మిరాయ్ సినిమా కూడా వస్తుంది. తేజ, టీంకి ఆల్ ది బెస్ట్.  రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదల మాట్లాడుతూ.. హారర్ నా ఫేవరెట్ జానర్, ఈ  ట్రైలర్ అదిరిపోయింది. డైరెక్టర్ కౌశిక్ అద్భుతమైన విజువల్స్ చూపించారు. టైటిల్ తోనే ఒక సూపర్ నేషనల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అనుపమ సాయి ద బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ అద్భుతంగా ఉంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Adah Sharma: ఆదా శర్మ బ్యూటీ సీక్రెట్ ఇదే.. క్యారెట్, ఎర్రకారం వుంటే?