Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు సిద్దమైన సస్పెన్స్, క్రైమ్ చిత్రం అథర్వ

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (19:11 IST)
Karthik Raju, Simran Choudhary
సస్పెన్స్, క్రైమ్ జానర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఆ జానర్ తో యూత్‌కు నచ్చేలా రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమే అథర్వ. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

అథర్వ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అథర్వ సినిమాలో క్లూస్ టీం విశిష్టతను, ప్రాముఖ్యతను చూపించేలా గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆశ్చర్యపర్చబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్ జరుగుతోంది.

అథర్వ అవుట్ పుట్ పట్ల దర్శక నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్రయూనిట్ ఉంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments