Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వ‌నీద‌త్ సంస్థ నుంచి రానున్న భారీ చిత్రాలు ఇవే..!

ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌.. ఇలా అగ్ర‌హీరోల‌తో స‌క్స‌స్ ఫుల్ మూవీస్ అందించిన మెగా ప్రొడ్యూస‌ర్ వైజ‌యంతీ మూవీస్ అధినేత‌ అశ్వ‌నీద‌త్. ఆయ‌న తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో భారీ మ

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (20:41 IST)
ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌.. ఇలా అగ్ర‌హీరోల‌తో స‌క్స‌స్ ఫుల్ మూవీస్ అందించిన మెగా ప్రొడ్యూస‌ర్ వైజ‌యంతీ మూవీస్ అధినేత‌ అశ్వ‌నీద‌త్. ఆయ‌న తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ నిర్మించారు. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఆ దేవ‌దాసు అక్కినేని పుట్టిన‌రోజైన సెప్టెంబ‌ర్ 20న ఈ దేవ‌దాస్ ఆడియో పార్టీ ఎన్ క‌న్వెన్ష‌న్లో అభిమానుల మ‌ధ్య గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్టు మెగా మేక‌ర్ అశ్వ‌నీద‌త్ తెలియ‌చేసారు.
 
త్వ‌ర‌లో నిర్మించ‌నున్న భారీ చిత్రాల గురించి అశ్వ‌నీద‌త్ తెలియ‌చేస్తూ… దేవ‌దాస్ చిత్రం త‌ర్వాత వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రెండు సినిమాలు నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్లో ఓ మూవీ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ భారీ చిత్రం, త‌మిళ డైరెక్ట‌ర్ అట్లీతో ఓ సినిమా చేయ‌నున్నాం. ప్ర‌స్తుతం ఈ చిత్రాల‌కు సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది అని తెలియ‌చేసారు. మొత్తానికి మ‌హాన‌టి ఇచ్చిన విజ‌యోత్సాహంతో భారీ చిత్రాలు నిర్మించేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేసారు. మ‌రి... ఈ భారీ చిత్రాలు ఎలాంటి ఫ‌లితాలు అందిస్తాయో..!

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments