Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగంలోకి దిగిన పవన్ ఫ్యాన్స్.. ఆషు రెడ్డి ఆర్మీ రెడీ అయినట్లేనా? (video)

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (12:19 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీని విజేతగా నిలిపేందుకు పవన్ ఫ్యాన్స్ పాత్ర కీలకం. తాను పవన్ కల్యాణ్ కు ఫ్యాన్‌నని, హౌస్ లోకి ఎంటర్ కాకముందే శివబాలాజీ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని విజేతగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇదే సెంటిమెంట్‌ను ఉపయోగించే ఆషు రెడ్డి సీన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.  
 
పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ అయిన ఆషు సీజన్-3లో ఉండటంతో, విజేత ఎవరో ఇప్పటికే ఖరారైపోయిందని టాక్ వస్తోంది. తన డబ్ స్మాష్ వీడియోలతో పాటు, కాస్తంత సమంత పోలికలున్న ఆషూ రెడ్డి ఈ సీజన్ విజేతగా నిలుస్తుందట. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్‌తో హౌస్‌లోకి ప్రవేశించిన ఆమెకు పవన్ ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారట. 
 
కాగా, తాను పవన్‌ కల్యాణ్‌ కి వీరాభిమానినని ఆషూ రెడ్డి చాలా సార్లు చెప్పుకుంది. కత్తి మహేశ్, పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం జరుగుతున్న వేళ, తన గుండెలపై పవన్‌ కల్యాణ్ అని టాటూ వేయించుకుని, ఆ ఫోటోను ఏ మాత్రం సంకోచించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
అప్పట్లో ఆమె పోస్ట్ చేసిన ఈ టాటూ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ అంతా ఈ చిత్రాన్ని షేర్ మీద షేర్ చేస్తూ, ఆమెను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఇంకేముంది ఆషు రెడ్డి ఆర్మీ రెడీ అయినట్లేనని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత ఆర్మీ చరిత్రలో ఓ మైలురాయి...

Kerala: రిపబ్లిక్ డే పరేడ్- కుప్పకూలిపోయిన పోలీస్ కమిషనర్ (video)

మహారాష్ట్రలో అంతుచిక్కని వైరస్... గిలియన్ బేర్ సిండ్రోమ్‌ తొలి మృతి

13వ అంతస్తు నుండి పడిపోయిన చిన్నారి.. కాపాడిన హీరో.. వీడియో వైరల్

నేటి నుంచి ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం (యూసీసీ) అమలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

తర్వాతి కథనం
Show comments