Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' నుంచి ఏమయ్యిందే ప్రోమో విడుదల

డీవీ
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (17:17 IST)
Ashok Galla
'హీరో' చిత్రంతో కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'దేవకీ నందన వాసుదేవ'చేస్తున్నారు. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
 
గతంలో కథానాయకుడి పాత్రను పరిచయం చేసిన టీజర్‌  సినిమా ప్రిమైజ్ ని ప్రజెంట్ చేసింది. టీజర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ట్రీట్‌తో ముందుకు వచ్చారు మేకర్స్. ఏమయ్యిందే ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు.
 
ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో  ఆకట్టుకునే బీట్‌లతో అద్భుతమైన పాటని అందించారు. ఈ పాట అశోక్ గల్లా తన లవ్ వారణాసి మానస పట్ల చూపుతున్న ఆరాధనను చూపుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ తమ రిలేషన్ ని సీక్రెట్ గా వుంచుతారు.
 
ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, వారణాసి మానస అందంగా ఉంది. వీరి జోడి తెరపై ఆకర్షణీయంగా కనిపించింది. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments