Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలం ఉన్నంత కాలం కైకాల బతికేవుంటారు : పోసాని కృష్ణ మురళి

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:23 IST)
vishnu with kaikala
కైకాల సత్యనారాయణ గారి మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. ఎఫ్. డి. సి. చైర్మన్  పోసాని కృష్ణ మురళి సంతాపం ప్రకటిస్తూ, కాలం  ఉన్నంత కాలం కాకపోయినా, సినీ కళాకారుడు ఉన్నంతకాలం కైకాల బతికేవుంటారు అని పేర్కొన్నారు. ఇక తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్  విష్ణు మంచు తెలుపుతూ,  తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి  మరణం తెలుగు సినిమా పరిశ్రమ కి ఒక తీరని లోటు.
 
రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు. కానీ మన పౌరాణిక చిత్రాల తో మనకు రాముడైనా, కృష్ణుడైనా నందమూరి తారక రామారావు గారు మాత్రమే అనిపించేలా నటించి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. అలాగే భీముడు, దుర్యోధనుడు, యముడు అంటే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది ఆజానుబాహుడు, హీరోలతో సరితూగే పాత్రలో నటించి మెప్పించగలిగే నటులలో ఒకే ఒక్కరు కైకాల సత్యనారాయణ గారు.
 
ఆయ‌న వేసిన పాత్ర‌లు, చెప్పిన డైలాగులు  తెలుగు వాడి గుండెల్లో  ప‌దిలంగా ఎప్ప‌టికీ నిలిచే ఉంటాయి. ఎన్నో మహత్తర పాత్రలకు జీవం పోసిన సత్యనారాయణ గారు మన తెలుగు వాడు కావడం విశేషం. తన ఆహార్యం, అభినయం తో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ గారు మన మధ్య లేకపోయినా కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో బతికే ఉంటారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments