Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాం.. సాయేషా, ఆర్య

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (12:26 IST)
అఖిల్ తొలి హీరోయిన్ సాయేషా త్వరలో పెళ్లి కూతురు కానుంది. ఇప్పటివరకు తమిళ హీరో ఆర్యతో ప్రేమలో వుందని.. త్వరలో పెళ్లి చేసుకోనుందని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు నిజమేనని సాయేషా, ఆర్య ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో సాయేషా.. ఆర్యతో తన పెళ్లి నిజమేనని తేల్చేసింది. 
 
''తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నానని.. తమను ఆశీర్వదించండి.." అంటూ హీరో ఆర్య కూడా ట్వీట్ చేశారు. ఇంకా అభిమానులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇకపోతే.. ఆర్య, సాయేషా గజినీకాంత్ చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటికే ఇరువైపు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. సాయేషా ప్రముఖ బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ మనవరాలు. తాజాగా సాయేషా, ఆర్యల వివాహాన్ని ధ్రువీకరిస్తూ విడుదలైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇంకా ఆర్య, సాయేషా జంటగా వున్న ఫోటో సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంకేముంది.. ప్రేమ జంట నుంచి దంపతులుగా మారనున్న ఆర్య, సాయేషాలకు శుభాకాంక్షలు తెలియజేద్దాం..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments