Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ గారు టైం ఇవ్వబట్టే దయా సీజన్ 2 కూడా తెరకెక్కిస్తా - డైరెక్టర్ పవన్ సాధినేని

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (15:28 IST)
Director Pawan Sadhineni,
రీసెంట్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన వెబ్ సిరీస్ దయా. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు కీ రోల్స్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీఎఫ్ ప్రొడక్షన్స్ లో శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించారు. బిగినింగ్ టు ఎండింగ్ దయా వెబ్ సిరీస్ ను ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు  దర్శకుడు పవన్ సాధినేని. దయా సూపర్ హిట్టైన నేపథ్యంలో తన సంతోషాన్ని పంచుకున్నారీ టాలెంటెడ్ డైరెక్టర్. పవన్ సాధినేని మాట్లాడుతూ
 
- దయా వెబ్ సిరీస్ కు వస్తున్న రెస్పాన్స్ సంతోషాన్నిస్తోంది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి మా వెబ్ సిరీస్ చూస్తున్నారు. ప్రతి చోట నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల చేసిన టూర్ లోనూ ప్రతి ఏరియాలో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. జేడీ చక్రవర్తి గారిని దయా అని పిలుస్తున్నారు. ఇండస్ట్రీ నుంచైతే చాలా కాల్స్ మెసేజ్ లు వస్తున్నాయి. బెంగాలీ వెబ్ సిరీస్ తక్ ధీర్ నుంచి ఇన్స్ పైర్ అయి దయా కథ రాసుకున్నాను. అయితే తక్ ధీర్ లో ఇంత విస్తృతమైన కథ ఉండదు. రిపోర్టర్, దయా అసిస్టెంట్ ఇలా..ఇన్ని క్యారెక్టర్స్ ఉండవు. ఆ వెబ్ సిరీస్ నుంచి కేవలం ఆంబులెన్స్ డ్రైవర్ కు డెడ్ బాడీ దొరకడం అనే అంశాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా అంతా నేను రాసుకున్నదే.
 
- జేడీ చక్రవర్తిని దయా క్యారెక్టర్  కోసం సెలెక్ట్ చేయడం హాట్ స్టార్ డిసిషన్. అయితే ఆయన నటుడితో పాటు దర్శకుడు కాబట్టి ఈ కథలో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడో అనుకున్నా. జేడీ ఈ వెబ్ సిరీస్ కు నో చెప్పాలనే అనుకున్నాను. ఫోన్ లో మాట్లాడిన తర్వాత నేను చేయబోయే సిరీస్ ఆయనకు అర్థమైంది. జేడీకున్న ఎక్సీపిరియన్స్ కు దర్శకుడి విజన్ తెలుసుకోగలరు. కథ పంపిస్తే ఆయన చదవకుండానే ఓకే చెప్పారు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. 
 
- దయా సిరీస్ లో మీరు చూసిందంతా ఒక గ్లింప్స్ మాత్రమే. దయా, అలివేలు క్యారెక్టర్స్ మెయిన్ గా చూశారు. అసలైన కథ, ట్విస్ట్ లు సెకండ్ సీజన్ లో ఉంటాయి. ఈ సిరీస్ ప్రారంభించినప్పుడు చాలా తక్కువ రిసోర్స్ లతో చేశాం. ఇది క్లిక్ అయితే ఇన్వెస్ట్ మెంట్స్ పెరుగుతాయి సెకండ్ సీజన్ ను గ్రాండ్ గా చేయొచ్చని ఆశించాం. మేము ఎక్స్ పెక్ట్ చేసినట్లే ఫస్ట్ భాగం మంచి హిట్ అయ్యింది. ఇక సెకండ్ సీజన్ ను మరింత పెద్ద స్పాన్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయబోతున్నాం.
 
- ఈ వెబ్ సిరీస్ కథను సినిమాగా చేసినా ఇంత డీటెయిల్డ్ గా, ఇన్ని క్యారెక్టర్ లతో తెరకెక్కించడం సాధ్యం కాకపోయేది. వెబ్ సిరీస్ కాబట్టి క్రియేటివ్ ఫ్రీడమ్  ఉంటుంది. ఎక్కడా ఏ సీన్ కావాలని పెట్టింది కాదు. అన్నీ కథలోని ఇంటెన్సిటీని తెలిపేందుకే ఉపయోగించాం. కొన్ని సీన్స్ ఇబ్బందిగా ఉన్నాయని చెబుతున్నారు అయితే...అవి ఆ పాత్రల యొక్క బాధను, స్ట్రగుల్ ను చెప్పేందుకు మాత్రమే పెట్టాం. సిరీస్ ను ఫ్లోలో చూస్తున్నప్పుడు ఎవరికీ ఇబ్బందిగా అనిపించదు.
 
- దయా సీజన్ 1కు డబుల్ స్కేల్ లో సీజన్ 2 ఉంటుంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. అన్నీ కుదిరాక వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్తాం.  ఇకపై సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తాను. గీతా ఆర్ట్స్ లో నేనొక సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నా. పెద్ద కాస్టింగ్ తో ఆ సినిమా ఉంటుంది. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఆ సినిమాలో నాకు కావాల్సిన కాస్ట్ అండ్ క్రూ డేట్స్ కోసం వేచి చూస్తున్నా. ఇంతలో దయా ఆఫర్ వచ్చింది. అరవింద్ గారికి చెబితే ఏప్రిల్ దాకా మన సినిమాకు టైమ్ ఉంది కదా ఈలోపు చేసుకుని వచ్చేయ్ అన్నారు. అలా దయా స్టార్ట్ చేశాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments