Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ఫస్ట్ లుక్ రాబోతుంది

naara rohit look
, శనివారం, 22 జులై 2023 (19:52 IST)
naara rohit look
సినిమాల నుంచి కొంత కాలం విరామం తీసుకున్న హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి బాణం, సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఎంచుకొని, చేసిన సినిమాలు, పాత్రలలో వైవిధ్యం చూపించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు రోహిత్.
 
రోహిత్ తన కమ్ బ్యాక్ మూవీ #NaraRohit19 కోసం ఒక యూనిక్  కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ఈ నెల 24న ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నామని, ప్రీ లుక్‌ పోస్టర్‌ ద్వారా నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు.ప్రీ లుక్  పోస్టర్‌లో చేతిలో వున్న పేపర్ కట్స్ ని చూపిస్తూ ‘“One man will stand again, against all odds.” అని  రాసిన కోట్ సినిమాలో రోహిత్ పాత్రను సూచిస్తోంది. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
 
ప్రముఖ తెలుగు దినపత్రికల నుంచి వివిధ ఆర్టికల్స్ వున్న నెంబర్ 2ని కూడా గమనించవచ్చు. ప్రీ లుక్ పోస్టర్ క్యూరియాసిటీని కలిగిస్తోంది.
 
ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన రోజున చిత్ర దర్శకుడు, ఇతర వివరాలను మేకర్స్  తెలియజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ విష్ణు కెరీర్‌లో రూ.50కోట్ల వసూళ్లు వస్తుందనుకోలేదు : సామజవరగమన నిర్మాత రాజేష్ దండా