Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హీరో' అవుతున్న విజయ్ దేవరకొండ

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:05 IST)
‘అర్జున్ రెడ్డి’ సినిమా అందించిన విజయంతో క్లాస్, మాస్ ఆడియన్స్ అనే తేడాలేకుండా అందరికీ అభిమాన హీరోగా తయారైపోయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత ‘గీతగోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో అమాంతం క్రేజ్ పెంచేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 
 
అయితే... తాజాగా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కబోయే మరో సినిమాకు విజయ్ సైన్ చేయడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 9గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందించనున్న ఈ సినిమాకు తాజాగా సినిమాకు ‘హీరో’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు చిత్రయూనిట్ వెల్లడించింది. 
 
చిత్రాన్ని ఏప్రిల్ 22 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన షాలినీ పాండే నటించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే, ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాకి గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకున్నందుకే... వాయించేస్తున్న మెగా అభిమానులు ఇక ఈ హీరో టైటిల్‌కి ఏం చెప్పనున్నారో... వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments