Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి జత కట్టనున్న అర్జున్ రెడ్డి.. ప్రీతి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (11:37 IST)
విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత పెద్ద స్థాయిలో నిల్చిపోయి... అతనిని సడన్ స్టార్‌గా చేసేస్తూ తెలుగు తెరపై కొత్త ముద్ర వేసిన సినిమా ''అర్జున్‌ రెడ్డి''. నటీనటుల ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఈ చిత్రానికి మర్చిపోలేని విజయాన్ని అందించాయి. 
 
ఇందులో తెరపై ఎక్కడా అర్జున్‌, ప్రీతి పాత్రలు తప్ప విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండేలు కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో... వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరించిన విధానం యువ ప్రేక్షకులను కట్టి పడేసింది.

ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి నటించబోతున్నారని  తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 
 
ఆనంద్‌ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఇందులో కథానాయిక పాత్ర కోసం షాలినీ పాండేని తీసుకున్నట్లు సమాచారం. క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. విజయ్‌ ఓ రేసర్‌ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈసారి ఈ జంట మరేం చేస్తారో చూద్దాం మరి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments