Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్ రెడ్డి' రామ‌కృష్ణ‌కు పెళ్లి ఫిక్స్.. 'ఎవరికీ చెప్పకండి' అంటూ ట్వీట్

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (11:37 IST)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సెన్సేషనల్ చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రంలో హాస్యనటుడిగా రామకృష్ణ నటించాడు. ఈ చిత్రంలో ఈయన పండించిన హాస్యానికి ప్రేక్షకులు కడుపుబ్బనవ్వారు. దీంతో రామకృష్ణకు మంచి పేరు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ ఇపుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
 
"జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరికీ చెప్పకండి" అంటూ ట్వీట్ చేశాడు. తనకు కాబోయే భార్యతో సముద్రపు ఒడ్డున దిగిన ఫొటోను జత చేశాడు. అయితే వారి మొహాలు కనిపించకుండా ఫొటో ఉండటంతో… పెళ్లికూతురు ఎవరు? ఎలా ఉంటుంది? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరోవైపు పెళ్లి వార్తను వెల్లడించిన రామకృష్ణకు హీరోలు నిఖిల్, సుశాంత్, సిద్ధార్థ్ కమెడియన్ వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ రామన్‌లతో పాటు పలువురు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments