Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎల్లప్పుడూ ప్రేమతో మీ రౌడీ.. ఇలా మారండి.. విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆన్‌లైన్ వేదికగా దుర్భాషలొద్దని వార్నింగ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ కథ

Advertiesment
ఎల్లప్పుడూ ప్రేమతో మీ రౌడీ.. ఇలా మారండి.. విజయ్ దేవరకొండ
, బుధవారం, 3 అక్టోబరు 2018 (16:00 IST)
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆన్‌లైన్ వేదికగా దుర్భాషలొద్దని వార్నింగ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ''నోటా'' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో యువకులకు ఆయనో ట్వీట్ చేశారు. తద్వారా సందేశాన్నిచ్చారు. సొంత, నియమ, నిబంధనలను ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. యువకులమైన మనం మార్పునకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. 
 
మార్పు అనేది సినిమాల్లో కావొచ్చు. జీవనశైలిలో కావొచ్చునన్నారు. మన రౌడీ కల్చర్ లేదా, మన యాటిట్యూడ్‌కు సంబంధించిన మార్పు ఏదైనా కావొచ్చు. సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా సానుకూల దృక్పథాన్ని మనం ట్రెండింగ్‌ చేయాల్సిన సమయం ఇదని గుర్తు చేశారు. తనపై అభిమానంతో చాలామంది తన ఫోటోను డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టుకున్నారు. 
 
కానీ మీలో చాలామంది కయ్యానికి కాలు దువ్వేలా వున్నారు. అలా తానెప్పటికీ చేయకు. దయచేసి మీరు అలా చేయకండి.. కొందరి మాటలు బాధ కలిగించవచ్చు. అందుకే ఆలోచించి మాట్లాడాలి. బతుకుదాం.. బతకనిద్దాం.. అంటూ అర్జున్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అలాగే విజయ్ దేవరకొండ.. యువకులకు సందేశం ఇచ్చారు. మనం చేయాల్సిందంతా సంతోషంగా ముందడుగు వేయాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకూడదని.. ఆన్‌లైన్‌ వేదికగా దుర్భాషలాడటం మాత్రం చూడాలనుకోవడం లేదని చెప్పారు. ఎల్లప్పుడూ ప్రేమతో మీ రౌడీ అంటూ అర్జున్ రెడ్డి తన ట్వీట్‌ను ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ షో జడ్జిగా కామెడీ రారాజు బ్రహ్మానందం.. అతనితో జత కట్టిన ఐస్ క్రీం బేబీ