Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌పై రెహమాన్ పాట.. రూ.500 చెల్లకపోయినా.. ట్రంప్‌ ప్రెసిడెంట్‌ అయినా టేక్‌ ఇట్‌ ఈజీ పాలసీ

తన వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారం రష్యా వద్ద ఉందంటూ వచ్చిన మీడియా కథనాలపై అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'అదంతా కట్టుకథ. నాపై ఆరోపణలు అ

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (16:27 IST)
తన వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారం రష్యా వద్ద ఉందంటూ వచ్చిన మీడియా కథనాలపై అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'అదంతా కట్టుకథ. నాపై ఆరోపణలు అవమానకరం. మానసిక రోగులు, నా వ్యతిరేకులు కలిసి చేసిన పని' అని విమర్శించారు. ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే డొనాల్డ్ ట్రంప్‌పై ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌. రెహమాన్‌ ఓ పాట పాడారు. 
 
ఎంటీవీ నిర్వహించిన 2017 అన్‌ప్లగ్‌డ్‌ కార్యక్రమంలో రెహమాన్‌.. మరో ఇద్దరు గాయకులతో కలిసి పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో రెహమాన్‌.. తాను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన 'ప్రేమికుడు' సినిమాలోని 'వూర్వశి.. వూర్వశి' పాటను, బొంబాయిలోని 'హమ్మా హమ్మా' పాటను రీమిక్స్‌ వెర్షన్‌లో పాడి అలరించారు.
అయితే పాటలో లిరిక్స్‌ మార్చి ప్రస్తుతం ఉన్న నోట్ల రద్దు, డొనాల్డ్‌ట్రంప్‌ల గురించి ప్రస్తావిస్తూ రెహమాన్‌ ఈ పాట పాడారు.
 
''రూ.500 ఇక పనికిరానివి..టేక్‌ ఇట్‌ ఈజీ పాలసీ..', 'ట్రంప్‌ ప్రెసిడెంట్‌ అయినా.. టేక్‌ ఇట్‌ ఈజీ పాలసీ'' అంటూ రెహమాన్‌ పాడారు. రెహమాన్ పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తూగో జిల్లాలో బర్డ్ ‌ఫ్లూ... భారీగా కోళ్లు మృతి.. కోడిమాంసం తినొద్దంటున్న అధికారులు..

గ్వాటెమాలో లోయలోపడిన బస్సు - 55 మంది మృతి

12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం- ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై ముగ్గురి అత్యాచారం.. ఆపై బ్లాక్‌మెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments