Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శాతకర్ణి' విజయంతో హీరో నితిన్‌కు కాసుల పంట.. "ఖైదీ" సూపర్‌హిట్‌తో దిల్ రాజుకు భారీ నష్టం

బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించడంతో... యంగ్ హీరో నితిన్‌కు కాసుల పంట పండబోతోంది. ఎందుకంటే ఈ సినిమా నైజాం హక్కులను నితిన్ (నితిన్ తండ్రి) దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ ఆనందాన్

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (15:51 IST)
బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించడంతో... యంగ్ హీరో నితిన్‌కు కాసుల పంట పండబోతోంది. ఎందుకంటే ఈ సినిమా నైజాం హక్కులను నితిన్ (నితిన్ తండ్రి) దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ ఆనందాన్ని నితిన్ ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చారిత్రాత్మక విజయం సాధించిందని పోస్ట్ చేశాడు. ఘన విజయం సాధించిన బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు క్రిష్, నటి శ్రియలతో పాటు యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపాడు. వాస్తవానికి, బాలయ్య సినిమాపై నితిన్ మొదటి నుంచి కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడట. తన అంచనాలు నిజమవడంతో నితిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
మరోవైపు.. చిరంజీవి చిత్రం ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ సాధించడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఓ కారణం లేకపోలేదు. సినిమా హిట్ అయితే.. లాభాలే కదా వస్తాయి.. నష్టాల్లో ఎందుకు కూరుకుంటారనే కదా మీ సందేహం.. అయితే, ఈ కింది చదవండి. 
 
సంక్రాంతి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. దాదాపు 9 యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా.. మెగాస్టార్‌లో ఆ జోరు.. ఆ ఊపు.. ఆ గ్రేసు ఏమాత్రం తగ్గలేదని అభిమానులు కితాబిస్తున్నారు. మెగా ఖైదీపై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హిట్ టాక్‌ని సొంతం చేసుకొన్న మెగా ఖైదీ థియేటర్స్ పెంచేందుకు చిత్రబృందం ట్రై చేస్తోంది. పైగా థియేటర్స్ సంఖ్యను పెంచడం అటుంచి ప్రస్తుతం ఆడుతున్న థియేటర్స్ నుంచి మెగా ఖైదీని తీసేసేందుకు అస్సలు ఇష్టపడటం లేదు.
 
ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా ఈనెల 14న రిలీజ్ కానున్న దిల్ రాజు 'శతమానం భవతి' కోసం బుక్ చేసుకొన్న థియేటర్స్‌లో మెగా ఖైదీని తీసేసేందుకు చిత్రబృందం ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో దాదాపు 200 థియేటర్స్‌ని దిల్ రాజు వదులుకోవాల్సి వస్తుందట. దీంతో తన సొంత చిత్రం శతమానం భవతిని అతి తక్కువ థియేటర్లలోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇందుకు దిల్ రాజు అంగీకరించక పోవడంతో రంగంలోకి దిగిన మరో నిర్మాత అల్లు అరవింద్ డీల్ సెట్ చేస్తున్నాడంట. అయితే, మొత్తంగా చూస్తే మెగా ఖైదీ కారణంగా దిల్ రాజు పంపిణీదారుడిగా కాస్తో.. కూస్తో లాభాలు చవిచూసే ఛాన్స్ ఉంది. కానీ, సొంతం చిత్రం ద్వారా లాభాలు చవిచూడలేక... నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ నష్టాన్ని భవిష్యత్‌లో ఏ రకంగానైనా ఫిల్ చేస్తామని మెగా కాంపౌండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైల్వే ట్రాక్‌లపై సెల్ఫీ, గ్రూప్ ఫోటోలు.. 24 ఏళ్ల వ్యక్తి రైలు ఢీకొని మృతి.. ఎక్కడ?

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments