Webdunia - Bharat's app for daily news and videos

Install App

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

దేవీ
సోమవారం, 7 జులై 2025 (17:54 IST)
SJ Surya, AR Rahman
దర్శకత్వానికి పది సంవత్సరాలు దూరంగా ఉన్న SJ సూర్య' కిల్లర్' సినిమాతో తిరిగి కెప్టన్ చైర్ లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్‌జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని V. C. ప్రవీణ్, బైజు గోపాలన్ కలిసి నిర్మిస్తున్నారు కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. 
 
అకాడమీ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రాజెక్ట్ రావడం చూస్తేనే సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం అవుతుంది. ఇది ఎస్.జె. సూర్యా – ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో ఐదో సినిమా. ఇంతకు ముందు నాని, న్యూస్, అన్బే ఆరుయిరే, పులి సినిమాల్లో కలిసి పనిచేశారు.
 
'కిల్లర్' సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇండియా అంతటా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలనే లక్ష్యంతో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
మిగతా క్యాస్ట్, టెక్నికల్ టీమ్ వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments