రాచరికం నుంచి జోరుపెంచే ‘టిక్కు టిక్కు’ పాటతో అలరించిన అప్సరా రాణి

డీవీ
శనివారం, 7 సెప్టెంబరు 2024 (15:42 IST)
Apsara Rani with the song Tikku Tikku
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. 
 
తాజాగా రాచరికం నుంచి జోరు పెంచే పాటను రిలీజ్ చేశారు. టిక్కు టిక్కు అంటూ సాగే ఈ హుషారైన పాటను పెంచల్ దాస్ రాశారు. పెంచల్ దాస్, మంగ్లీ గాత్రంలో ఈ పాట కిక్కిచ్చేలా ఉంది. వెంగి ఇచ్చిన ఈ బాణీ ఎంతో హుషారుగా అనిపిస్తోంది. పర్‌ఫెక్ట్ జాతర సాంగ్‌లా ఎంతో రిచ్‌గా పాటను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. పోలకి విజయ్ కొరియోగ్రఫీతో ఈ పాట తెరపై విజువల్ ఫీస్ట్‌గా కనిపించేలా ఉంది.
 
ఈ మూవీకి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా పని చేశారు. రామ్ ప్రసాద్ మాటలు అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చాణక్య, ఎడిటర్‌గా జేపీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
 
ఈ చిత్రంలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్,  విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపేశాడు.. మృతదేహాన్ని బైకుపై ఠాణాకు తీసుకెళ్ళాడు..

విమానంలో ప్రయాణికురాలికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments