Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో సరికొత్త అంశంతో వచ్చిన వరుణ్ సందేశ్, విరాజి చిత్రం - రివ్యూ రిపోర్ట్

Advertiesment
Vijazi - Varun sandesh

డీవీ

, శుక్రవారం, 2 ఆగస్టు 2024 (17:33 IST)
Vijazi - Varun sandesh
నటీనటులు: వరుణ్ సందేశ్, ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తదితరులు. 
 
కొంత గేప్ తీసుకుని మరలా ఫామ్ లోకి వచ్చిన నటుడు వరుణ్ సందేశ్, ఇందువదనతో సరికొత్తగా ప్రెజెంట్ అయ్యారు. ఆ తర్వాత రెండు సినిమాలు చేశాడు. ఈసారి విరాజి అనే సరికొత్త టైటిల్ తో ముందుకు వచ్చాడు. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో రూపొందగా మహేంద్ర నాథ్ కూండ్ల ఎమ్3 మీడియా పతాకం పై మహా మూవీస్ తో కలిసి నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. 
 
కథ
పిచ్చాసుపత్రిలో జరిగే కథ. అక్కడ జరిగే మిస్టరీని ఛేదించడానికి వరుణ్ సందేశ్ ఏం చేశాడన్నది ప్రధాన పాయింట్. కొంతమంది రకరకాల కారణాలతో ఈ ఆసుపత్రికి వస్తారు. కానీ వచ్చాక వారు బయటపడడం కష్టం. ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుంటారు. ఇది గ్రహించిన కొందరు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా ఆ సమయంలో వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలే మిగిలిన కథ. అసలు వరుణ్ ఎందుకు ఆసుపత్రికి వచ్చాడు? అక్కడివారు ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు? వారంతా ఎందుకు పిచ్చాసుపత్రికి వచ్చారు? అనేది తెరపై చూడాల్సిందే. 
 
సమీక్ష:
మానసిక రోగుల కథలో పలు సినిమాలు వచ్చాయి. అయితే విరాజిలో సరికొత్త అంశాన్ని దర్శకుడు టచ్ చేశాడు. అందులో వరుణ్ సందేశ్ పాత్ర చాలా కీలకం. థ్రిల్లర్స్ సస్పెన్స్ అంశాలను జోడించడమేకాకుండా కథనంలో మలుపులు చివరిలో వున్నా మధ్యలో ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు కేర్ తీసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే పిచ్చాసుపత్రిలోనికి కొందరిని రప్పించడానికి కారకులు ఎవరనేది ట్విస్ట్ చాలా బాగుంది. ఎవరు ఆ పని చేసిందనేది ఉత్సుకతను  ప్రేక్షకుల్లో డైరెక్టర్ కలిగించాడు. 
 
సహజంగా ఇంటర్ వెల్ వరకు కథలోని పాత్రలు వారి పరిచయాలతో ఓ సంఘటన చూపించి లాగించేస్తారు. సస్పెన్స్, థ్రిల్లర్ కాబట్టి ఆ తరహాలో వెళ్లినా సంటర్ వెల్ బ్లాక్ ఫ్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. దానితో రెండో భాగంపై ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు. కొన్ని చోట్ల చిన్నపాటి లోపాలున్నా  అవన్నీ మర్చిపోయేలా దర్శకుడు చేశాడు. అసలు వరుణ్ సందేశ్ పాత్రే సినిమాకు కీలకం. పతాక సన్నివేశంలో కొందరికైతే ఎమోషన్ కు లోనవుతారు. ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ గా సినిమాను తీశారు. ఇందులో నటించిన నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. బలగం జయరాం,  ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి ఎంటర్ టైన్ చేశారు. 
 
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కు నేపథ్య సంగీతం చాలా కీలకం. దాన్ని ఎబెనైజర్ పాల్ బాగా డీల్ చేశాడు. సినిమాటోగ్రఫీ కథానుగుణంగా బంధించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అనుకున్నట్లుగా సినిమాను తీయగలిగారు. థ్రిల్లర్ సరికొత్త అంశాలు ఇష్టపడేవారికి ఈ సినిమా చక్కటి సినిమా అవుతుంది. 
రేటింగ్ : 2. 75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది ఇండియా హౌస్ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఎంట్రీ తో అభిషేక్ అగర్వాల్ ఖుషీ