Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్నా టైమ్ అయేగా! అంటోన్న సాయితేజ్‌

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:24 IST)
Sai Dharam Tej
సాయి ధరమ్ తేజ్  మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా చలన చిత్ర రంగ ప్రవేశం చేసాడు. తను వై.వి.ఎస్. చౌదరి "రేయ్" చిత్రంతో చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టి, "పిల్లా నువ్వులేని జీవితం" చిత్రంతో గుర్తింపు పొందాడు. ఆ త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి, సుప్రీమ్ వంటి చిత్రాల్లో బాబాయ్‌ల‌ను ఇమిటేట్ చేస్తూ పాట‌ల్లో కూడా డాన్స్ చేశాడు.
 
లేటెస్ట్‌గా రిప‌బ్లిక్ అనే సినిమాలో న‌టించాడు. స‌మాజంలో పిరిగిపోతున్న కుల వ్య‌వ‌స్థ‌, అవినీతిని ప్ర‌క్షాళ‌న చేసే ఉద్దేశ్యంతో చేసిన ఆ సినిమా విడుద‌ల త‌ర్వాత మంచి పేరు తెచ్చుకుంది. కానీ దాన్ని పూర్తిగా ఆస్వాదించ‌లేక‌పోయాడు. రిలీజ్ కుముందే రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర‌గాయాలై కోమాలోకి వెళ్ళిన ఆయ‌న అభిమానుల ప్రార్థ‌న‌లు, త‌ల్లిదండ్రుల పూజ‌ల వ‌ల్ల బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత కొంత కాలం రెస్ట్ తీసుకుని ఇప్పుడు ఆరోగ్య‌ప‌రంగా ఫిట్‌గా అయ్యారు. ఇక తాను సిద్ధంగా వున్నాన‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. న‌మ్మ‌కం వుండాలి. మ‌న‌పై న‌మ్మ‌కం బ‌లంగా వుండేలా విశ్వసించండి, అప్నా టైమ్ అయేగా! అంటూ ట్వీట్ చేశాడు.
 
తాజాగా ఆయ‌న ఓ కొత్త చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments