Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కేసీఆర్ వెంట నటుడు ప్రకాష్ రాజ్: పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారా?

Advertiesment
సీఎం కేసీఆర్ వెంట నటుడు ప్రకాష్ రాజ్: పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారా?
, ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (21:12 IST)
ఫోటో కర్టెసి-koo
వచ్చే 2024 ఎన్నికల్లో భాజపాను చిత్తుచిత్తుగా ఓడించాలనీ, ప్రధాని మోదీని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భాజపా వైరివర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో శనివారం నాడు సమావేశమయ్యారు.

 
ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్‌లతో నటుడు ప్రకాష్ రాజ్ సమావేశం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ ముగిసాక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు.

 
కేసీఆర్ మాట్లాడుతూ..“భారతదేశం కొత్త ప్రణాళికలు, కలలతో ముందుకు వెళ్లాలి. ఈ విషయమై శరద్ పవార్‌తో మాట్లాడాను. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు. ఆయన నన్ను ఆశీర్వదించారు. కలిసి పని చేస్తాం. ఇతర భావసారూప్యత గల పార్టీలతో త్వరలో సమావేశాలు జరుగుతాయి. జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణపై జరుగుతున్న సమావేశంలో నటుడు ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. దీంతో ఆయన ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారు.

మరోవైపు తెలంగాణలో ఏదో ఒక పార్లమెంటు స్థానం నుంచి ప్రకాష్ రాజ్ తెరాస నుంచి పోటీ చేస్తారంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ప్రకాష్ రాజ్ నిర్ణయం ఏంటో చూడాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమాని అత్యుత్సాహం.. పవన్ కళ్యాణ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం