అన్య'స్ ట్యుటోరియల్ టీజర్ ఆస‌క్తిగా వుంది - ప్రభాస్

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (11:25 IST)
Prabhas
ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వారి హారర్ వెబ్ సిరీస్ 'అన్య'స్ ట్యుటోరియల్' టీజర్‌ను లాంచ్ చేసారు. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్‌ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఆహా ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళ్ భాషలలో అతి త్వోరలోనే లాంచ్ చేయనుంది.
 
టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, "అన్య'స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. అల్ ది బెస్ట్ టు టీం అఫ్ అన్య."
ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది. కానీ అదే డిజిటల్ రంగం అందరిని భయపెడితే? అదే అన్య'స్ ట్యుటోరియల్. అన్య (నివేదితా సతీష్) ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది. రెజీనా కెసాండ్రా (మధు) కి తన చెల్లి అన్య ప్రొఫెషన్ అంటే నచ్చదు. కానీ ఒక రోజు మొత్తం మారిపోతుంది. ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది. అసలు ఎందుకు? అని తెలుసుకోవాలంటే ఆహా మరియు ఆర్కా మీడియా వారి 'అన్య'స్ ట్యుటోరియల్' చూడాల్సిందే. అభిమానుల కోసం ఆహా వారు ఈ వెబ్ సిరీస్ ను తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయబోతున్నారు.
 
https://fb.watch/dy_MnVIpVj/

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments