రానా దగ్గుబాటి కథానాయకుడిగా సినిమాలు చేసినా పెద్దగా హిట్స్‌లేవు. బాహుబలి చిత్రం తర్వాత మరీను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో `భీమ్లానాయక్`లో డేనియన్ షేక్‌గా నటించాడు. అందులో రానాకే పేరు వచ్చింది.
హీరోగా ఎందుకని మీకు హిట్స్ లేవని రానాను అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం ఇది. నేను ఏ పాత్ర వేసినా హీరోనే. సోలో హీరోగా చేస్తే అందుకు నా హైట్‌కు తగిన విలన్ లేడు. అదొక పెద్ద ప్రాబ్లమ్ ఎదురవుతుంది. నా అంత ఎత్తు నాతో ఢీ అంటే ఢీ అనే విలన్ వుంటేనే సినిమా జనాలు చూస్తారు. డేనియన్ షేక్ పాత్ర చేశాక మీకు తెలిసింది కదా అంటూ తెలిపారు. నటుడిగా అన్ని పాత్రలు వేయాలని చేస్తున్నాను. విరాటపర్వంలో నగ్జలైట్ పాత్ర వేశాను. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అది. అయినా నేను చేశానంటే అందులో కథ బాగా నచ్చింది. అదేవిధంగా పాన్ వరల్డ్ లెవల్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలో చెబుతాని అని చెప్పారు.