Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కకు ఏమైంది.. కాలు విరిగిందా? సోషల్ మీడియాలో చర్చ?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (13:11 IST)
లీవుడ్ క్వీన్ అనుష్కకు కాలికి గాయమైంది. దీంతో ఆమెకు కాలు విరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయింది. అయితే, ఈ చిత్రంలో అనుష్క కూడా నటించినట్టు సమాచారం. నిజానికి దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ, నెటిజన్లు మాత్రం సైరా చిత్రంలో నటించిందినీ, ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ఆమె గాయపడిందనే ప్రచారం జరుగుతోంది.
 
ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో అనుష్క కాలికి గాయ‌మైన‌ట్టు స‌మాచారం. చికిత్స చేసిన వైద్యులు అనుష్క‌ని కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమ‌ని సూచించార‌ట‌. ఈ ఘ‌ట‌న జ‌రిగి చాలా రోజులే అవుతున్న‌ప్ప‌టికి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింద‌ని అంటున్నారు. 
 
కెరీర్ ప్రారంభంలో "స్టాలిన్" చిత్రంలో చిరుతో క‌లిసి స్టెప్పులేసిన ఈ అమ్మ‌డు మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత చిరుతో న‌టిస్తుంది. మ‌రోవైపు అనుష్క 'నిశ్శ‌బ్ధం' అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల అమెరికాలో మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. మాధ‌వ‌న్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments