Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా: పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్న దేవసేన

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:06 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించే భారీ బడ్జెట్ మూవీ ''సైరా'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. మరో కీలక పాత్రలో తమన్నా నటిస్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ''సైరా''లో దేవసేన ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్ వస్తోంది. సైరాలో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం బాహుబలి దేవసేన అనుష్కను ఎంపిక చేశారని తాజాగా ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఆ పవర్ ఫుల్ పాత్రకు అనుష్కనే సరిపోతుందని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పడంతో.. నిర్మాత, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్.. అనుష్కతో స్వయంగా మాట్లాడి.. ఒప్పించినట్లు సినీ జనం అంటున్నారు. ఇప్పటికే ఊపిరి సినిమాలో నాగార్జున కోసం ప్రత్యేక పాత్రలో అలా మెరిసిన అనుష్క.. మళ్లీ మెగాస్టార్ కోసం.. కీలక పాత్రలో కనిపించేందుకు సై అందని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments