Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

దేవీ
మంగళవారం, 3 జూన్ 2025 (10:39 IST)
Anushka Shetty, ghati team
అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్‌ సక్సెస్ ఫుల్ మూవీ 'వేదం'తర్వాత కలిసిన చేస్తున్న చిత్రం 'ఘాటి'. హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఇది. అనుష్క, UV క్రియేషన్స్‌తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం. 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.

దీని తర్వాత, తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్ లో కనిపించిన  క్యారెక్టర్ గ్లింప్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇది సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది. ఘాటిని UV క్రియేషన్స్ సమర్పిస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తారు.
 
ఈరోజు, మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్‌ ఇచ్చారు.  ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాను  జూలై 11న రిలీజ్ కానుంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. రిలీజ్ డేట్  పోస్టర్‌లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి.
 
ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.
ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments