Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ సినిమాలు చేయడమే బెస్ట్.. ఎక్కువ సినిమాల టార్గెట్ వద్దే వద్దు: అనుష్క శర్మ

అవకాశాలు కాకుండా ప్రాధాన్యత గల పాత్రలే ఎంచుకుంటున్నట్లు అనుష్క శర్మ తెలిపింది. మిగిలిన హీరోయిన్లలా కాకుండా.. విభిన్న పాత్రలను ఎంచుకోవడమే బాలీవుడ్‌లో తనకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని అనుష్కశర్మ చెప్తో

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (15:14 IST)
అవకాశాలు కాకుండా ప్రాధాన్యత గల పాత్రలే ఎంచుకుంటున్నట్లు అనుష్క శర్మ తెలిపింది. మిగిలిన హీరోయిన్లలా కాకుండా.. విభిన్న పాత్రలను ఎంచుకోవడమే బాలీవుడ్‌లో తనకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని అనుష్కశర్మ చెప్తోంది. ''తక్కువ సినిమాలు చేయడమే సౌకర్యంగా ఉంది. అయితే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయమని మొదట్లో నాకు చాలామంది సలహాలిచ్చేవారు. 
 
కానీ ఎక్కువ సినిమాలు చేయాలనే టార్గెట్‌ పెట్టుకొని నటించాలని ఎప్పుడూ అనుకోలేదని అనుష్క శర్మ వ్యాఖ్యానించింది. తన కెరీర్‌కు బలాన్నిచ్చే పాత్రల్లోనే కనిపిస్తానని చెప్పుకొచ్చింది. గతేడాది అనుష్క నటించిన 'సుల్తాన్‌'.. 'యే దిల్‌హై ముష్కిల్‌' బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఆమె నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవలే 'ఫిల్లౌరీ' షూటింగ్‌ ముగించుకున్నానని అనుష్క చెప్పింది. ఇంతియాజ్‌ అలీ సినిమా 'ది రింగ్‌'(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణలో ఉన్నానని వెల్లడించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments