Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక‌పై అందిరికీ 'కూ'తో అందుబాటులో వుంటాన‌న్న అనుష్క

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (13:20 IST)
Anuskha twitter
అనుష్క శెట్టి చాలా కాలం పాటు ఏం చేస్తుందో అస‌లు ఎలా వుంద‌నేది కూడా వివ‌రాలు తెలిసేవికావు. త‌న సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా అప్‌డేట్స్ వుండ‌వు. ఇటీవ‌లే కొద్ది నెల‌ల నాడు త‌న బ‌ర్త్‌డే రోజు త‌న త‌ల్లిదండ్రుల‌తో వున్న పాత ఫొటోను పోస్ట్ చేసింది. అయితే ఇప్ప‌డు ఆమె జ‌నజీవ‌న స్ర‌వంతిలోకి రావాల‌కుంటోంది. అందుకే త‌న ట్విట్ట‌ర్‌లో ఈరోజే ఓ పోస్ట్ పెట్టింది. హాయ్ అంటూ అంద‌రినీ ప‌లుక‌రించి కొత్త‌గా కూ అనే యాప్‌తో మీకు అందుబాటులో వుంటానంటూ పేర్కొంది.
 
ఇది ట్విట్టర్ కు ప్రత్యామ్న్యాయంగా దేశీయ ట్విట్టర్ గా పేరొందిన “కూ” యాప్. ఇటీవ‌లే ట్విట‌ర్ యాజ‌మాన్యం భార‌త్‌కు కొన్ని ఆంక్ష‌లు విదించ‌డంతో ఇది ఇప్పుడు ప్రాచుర్యంలోకి తీసుకురావాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ యాప్‌లో సినిమా వాళ్ళు, పొలిటిష‌న్స్ కూడా ప్ర‌వేశించాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే చాలామంది సామాన్యులు కూడా ఇందులో జేరారు. అందుకే అనుష్క శెట్టి కూడా “కూ”లోకి ఎంట్రీ ఇచ్చారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’లోకి అడుగు పెట్టినట్లు అనుష్క ట్విట్టర్ ద్వారా ఇలా తెలియ‌జేశారు.

“హాయ్ ఆల్… మీరందరూ బాగున్నారని, సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం నా అధికారిక ‘కూ’ ఖాతాలో నన్ను ఫాలో అవ్వండి… ధన్యవాదాలు” అంటూ అనుష్క ట్వీట్ చేసింది. ఇక‌పై అనుష్క ఏఏ సినిమాలు చేస్తుందనేది అధికారికంగా తెలుసుకోవ‌చ్చు అన్న‌మాట‌.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments