Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలిని పెళ్లాడిన ఆడమ్ జంపా.. స్టోయినిస్ గుండె పగిలింది..

Advertiesment
ప్రియురాలిని పెళ్లాడిన ఆడమ్ జంపా.. స్టోయినిస్ గుండె పగిలింది..
, బుధవారం, 23 జూన్ 2021 (10:14 IST)
Adam zampa
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి హట్టి లీ పాల్మెర్‌ను ఈ ఆసీస్ స్పిన్నర్ సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్నాడు. వీరి పెళ్లి రెండుసార్లు వాయిదా పడింది. దాంతో జంపా ఎవరికీ తెలియకుండా గతవారమే తన ప్రేయసిని వివాహమాడాడు.

గతేడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌లో చిక్కుకోవడంతో జంపా సహా పలువురి వివాహాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వారిలో చాలామంది ఏదో రకంగా వివాహాలు చేసుకుని జంటలుగా మారారు. వైరస్ ఇంకా భయపెడుతుండడంతో కొందరు క్రికెటర్లు మాత్రం ఇంకా శుభ ఘడియల కోసం ఎదురుచూస్తున్నారు.
 
ఆడం జంపా గతవారమే వివాహం చేసుకున్నప్పటికీ ఆ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగా ఉంచాడు. ఇప్పటికి అతని వివాహం గురించి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే, జంపా ప్రేయసి హట్టీ లీ వివాహ దుస్తులను డిజైన్ చేసిన కేట్ వాలియా అనే కంపెనీ మాత్రం వీరిద్దరి వివాహ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో జంపా వివాహం వెలుగులోకి వచ్చింది. దాంతో ఈ ఆసీస్ లెగ్ స్పిన్నర్‌కు అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు విషెస్ తెలియజేస్తున్నారు. జీవితాంతం సంతోషంగా ఉండాలని కూడా దీవిస్తున్నారు.
 
మరోవైపు ఆడమ్ జంపా పెళ్లిచేసుకోవడంతో.. నెటిజన్లు మరో ఆస్ట్రేలియా ప్లేయర్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. జంపా వివాహంతో స్టోయినిస్ గుండె పగిలిందని, అతన్ని ఆసీస్ స్పిన్నర్ మోసం చేశాడని కామెంట్ చేస్తున్నారు.

స్టోయినిస్, ఆడమ్ జంపాల మధ్య ఉన్న స్నేహం, సానిహిత్యం నేపథ్యంలో ఈ ఇద్దరు గేలు అని పెద్ద రచ్చ నడిచింది. అలాంటిదేం లేదని సహచర ఆటగాళ్లు ఖండించినా అవకాశం దొరికినప్పుడల్లా అభిమానులు ఈ ఇద్దరిని గేలు చిత్రీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ సిక్స్ కొట్టి తలపట్టుకున్నాడు.. కారణం ఏంటో తెలుసా? (video)