Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ నటి రూపాలీ గంగూలీ కొత్త రికార్డ్.. ఏంటదో తెలుసా?

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:21 IST)
Anupama
టీవీ నటి రూపాలీ గంగూలీ కొత్త రికార్టును తన ఖాతాలో వేసుకుంది. ఆమె నటిస్తున్న ‘అనుపమ’ టీవీ డ్రామా సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 
 
ఈ షో టీఆర్పీ రేటింగ్ ఏకంగా 4 మార్కుకు దగ్గరలో ఉంది. ఈ షోలో నటిస్తున్న అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని, ముఖ్యంగా రూపాలీ గంగూలీదే ఆ ఘనత అని చెప్పుకుంటున్నారు. 
 
‘అనుపమ’ ఇప్పుడు దేశంలోని పల్లెపల్లెను తాకింది. ఈ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దీనికి పాప్యులారిటీ రావడం వెనకున్న రూపా గంగూలీ పారితోషికంపై చర్చ మొదలైంది.
 
‘బాలీవుడ్ లైఫ్’ ప్రకారం.. రూపాలీ గంగూలీ మొదట్లో రోజుకు లక్షన్నర రూపాయలు పారితోషికంగా తీసుకునేవారు. అప్పట్లో అదే అత్యధికమైనా ఆమె సీనియర్ నటిగానే ఉండిపోయారు. 
 
ప్రస్తుతం "అనుపమ"గా ఆమె రేంజ్ ఓ స్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు రోజుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. 
 
ఫలితంగా భారత టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా ఆమె రికార్డులకెక్కారు. 44 ఏళ్ల ఈ నటి కొన్ని నెలల క్రితమే తన పారితోషికాన్ని పెంచినట్టు ఇండస్ట్రీ టాక్.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments