Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో కరోనా కలకలం - వైరస్ బారినపడుతున్న సెలబ్రిటీలు.. బిగ్ బి ఆరోగ్యం ఎలావుంది?

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (19:32 IST)
బాలీవుడ్ మూవీ ఇండ‌స్ట్రీలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తుంది. ప‌లువురు సెల‌బ్రిటీలు లేదంటే వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది క‌రోనా బారిన ప‌డుతుండ‌టంతో అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొంది. శనివారం రాత్రి అమితాబ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కి కరోనా పాజిటివ్ అని తేల‌గా, నటి రేఖ బంగళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒక‌రు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఆమె బంగళాను ముంబై మున్సిపల్ అధికారులు మూసివేశారు. అలాగే, అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్, మనుమరాలు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ త‌న త‌ల్లి, సోద‌రునితో పాటు మరో ఇద్ద‌రికి కరోనా సోకింద‌ని వెల్లడించారు.
 
అనుప‌మ్ ఖేర్ త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో షేర్ చేస్తూ.. త‌న త‌ల్లి దులారికి కొద్ది పాటి కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని పేర్కొన్నాడు. సోద‌రుడు, వ‌దిన‌, మేన‌కోడ‌లు కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ని స్ప‌ష్టంచేశాడు. గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న దులారికి ఆక‌లి లేద‌ట‌. నిద్ర కూడా సరిగా ప‌ట్ట‌క‌పోవ‌డంతో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో ఆమెకి కరోనా అని తేలింది. 
 
ప్ర‌స్తుతం  త‌న త‌ల్లి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండ‌గా, మిగ‌తా వారు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అనుప‌మ్ ఖేర్ ఫ్యామిలీలో న‌లుగురికి క‌రోనా అని తెలియ‌డంతో బీఎంసీ సిబ్బంది ఆయ‌న ఇంటిని శానిటైజ్ చేస్తుంది. అయితే త‌న ఫ్యామిలీని క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో అనుప‌మ్ కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఇందులో ఆయ‌నకి నెగెటివ్ అని తేలింది.
 
మరోవైపు, కరోనా వైరస్ బారినపడిన బాలీవుడ్ బిగ్ బి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే కాలేయ‌, ఉద‌ర సంబంధిత వ్యాధితో బాధ‌పడుతున్న అమితాబ్ బ‌చ్చ‌న్‌కి క‌రోనా సోకింద‌నే విష‌యం తెలుసుకున్న ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్యం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వాక‌బు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 
 
అయితే అమితాబ్ చికిత్స‌కి సానుకూలంగా స్పందిస్తున్నారు. భ‌య‌ప‌డాల్సిందే ఏమి లేదు. రాత్రి ఆయ‌న  ప్ర‌శాంతంగా నిద్ర పోయార‌ని నానావ‌తి ఆసుప‌త్రికి చెందిన వైద్యుడు డాక్ట‌ర్ అన్సారీ పేర్కొన్నారు. అమితాబ్‌తో పాటు అభిషేక్ కూడా క‌రోనా బారిన ప‌డ‌డంతో వారిద్ద‌రు త్వ‌ర‌గా కోలుకోవాలని సినీ, రాజ‌కీయ, క్రీడా ప్ర‌ముఖులు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments