ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న సినిమా కార్తికేయ 2. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆగస్ట్ 12న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా సినిమాలోని కృష్ణ ఈజ్ ట్రూత్ అనే హ్యాష్ ట్యాగ్‌ను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విడుదల చేసారు. సినిమాలో ఈయన కూడా అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడి తత్వం గురించే ఈ సినిమా కథ అంతా సాగుతుందని ఇదివరకే చెప్పారు మేకర్స్.