Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీమామ‌కి రెండు క్లైమాక్స్‌లు షూట్ చేస్తున్నారా..?

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (12:52 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్యల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. ఈ చిత్రానికి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. 
 
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే వెంకీ మామ సినిమాకి రెండు క్లైమాక్స్‌లు ప్లాన్ చేస్తుండ‌డం. 
 
వెంకీమామ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండాలి? అనే అంశం పై ముందుగా మనసు కదిలించే భావోద్వేగాలతో క్లైమాక్స్ రెడీ చేశారట. కానీ వినోదం కోరుకునే ప్రేక్షకులు దీన్ని అంగీకరిస్తారా? లేదా? అనే సందేహం రావడంతో డైరెక్టర్ బాబీ మరో క్లైమాక్స్‌ను కూడా హ్యాపీ ఎండింగ్‌తో సిద్ధం చేశారని తెలిసింది. 
 
అయితే రెండు క్లైమాక్స్‌లు తీశాక ప్రొడ్యూసర్ సురేష్ బాబు జడ్జిమెంట్ ప్రకారం ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది.
 
 ఒక‌టి సాడ్ ఎండింగ్ కాగా.. మ‌రొక‌టి హ్యాపీ ఎండింగ్. మ‌రి... సురేష్ బాబు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో.. క్లైమాక్స్ ఎలా ఉంటుందో అనేది ఆస‌క్తిగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments