Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వరుణ్ తేజ్ 'అంతరిక్షం 9000 KMPH '

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం అంతరిక్షం 9000 KMPH. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (18:27 IST)
వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం అంతరిక్షం 9000 KMPH. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో తెలియజేశారు. షూటింగ్ స్పాట్‌లోని ఓ ఫోటోని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అమేజింగ్‌గా అనిపించింది అని వెల్లడించారు. మొదటి సినిమా 'ఘాజి'తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్‌ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్‌ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.
 
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పటివరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21 న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది. 
 
తెలుగులో పూర్తిస్థాయి 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే. వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు న‌టించిన ఈ చిత్రానికి దర్శకుడు: సంకల్ప్ రెడ్డి, సమర్పణ‌ : క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు : క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, డీఓపీ : జ్ఞాన శేఖర్ VS, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: ప్రశాంతి విహారీ, ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా, యాక్షన్ కొరియోగ్రాఫర్: టాడార్ పెట్రోవ్ లాజరోవ్, CG : రాజీవ్ రాజశేఖరన్, PRO: వంశీశేఖర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments