Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి కుటుంబలో మరో హీరో చైతన్యకృష్ణ సినిమా బ్రీత్

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (08:30 IST)
Chaitanyakrishna, Jayakrishna, Kalyan Ram
నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ని నందమూరి కళ్యాణ్ రామ్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి ‘బ్రీత్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
 
ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘బసవతారకరామ క్రియేషన్స్’ పై  ప్రొడక్షన్ నెం 1 సినిమా బ్రీత్ టైటిల్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో మా పెదనాన్న నందమూరి జయకృష్ణ గారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మా అన్నగారైన నందమూరి చైతన్యకృష్ణ గారు ఈ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఇది ఎమోషనల్ థ్రిల్లర్. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ అలరిస్తుందని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు
 
నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ.. బ్రీత్ ఎమోషనల్ థ్రిల్లర్. చైతన్య ప్రధాన పాత్ర పోషించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.  
 
ఈ చిత్రంలో చైతన్య కృష్ణకు జోడిగా వైదిక సెంజలియా నటించారు. రాకేష్ హోసమణి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు.
 
తారాగణం: నందమూరి చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్ , కేశవ్ దీపక్, మధు నారాయణ్, ఎస్ఆర్ఎస్ ప్రసాద్, అయిషాని, సహస్ర తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments