Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

దేవీ
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (17:51 IST)
Vishal 35 movie - Anjali
అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో విశాల్ 35వ ప్రాజెక్ట్‌లోకి అంజలి ప్రవేశించారు. విశాల్ ఇప్పుడు తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. చివరగా ‘మద గద రాజా’ అంటూ అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్‌లతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో సినిమా రాబోతోంది. విశాల్ 35 ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.  
 
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో అంజలి కీలక పాత్రను పోషించబోతోన్నారు. ఈ మేరకు విశాల్ 35 ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారన్నట్టుగా టీం ప్రకటించింది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఆంటోనీ విజయం తర్వాత జి.వి. ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిసి పనిచేస్తున్నారు. నటి దుషార విజయన్ విశాల్ సరసన కథానాయికగా నటించనున్నారు.
 
ఈ కొత్త చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ముఖ్యంగా ‘మధ గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్‌తో జతకట్టడం విశేషం. 
 
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (NH4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), నటులు కార్తీ, జీవా, డిఓపి ఆర్థర్ ఎ విల్సన్, పంపిణీదారు తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరై యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 
 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తకు అలా దగ్గరైంది.. కానీ వేధింపులకు గురిచేశాడని ఆత్మహత్య

అర కేజీ బరువుతో జన్మించిన పసికందుకు ప్రాణం పోసిన హైదరాబాద్ వైద్యులు

కేక్ కట్ చేయాల్సిన 9 యేళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసింది...

ఏపీ లిక్కర్ స్కామ్‌: నారాయణ స్వామికి నోటీసులు.. అరెస్ట్ అవుతారా?

భార్యాభర్తలు పడక గదిలో ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసి వివాహితకు పంపారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments