సెకండ్ ప్లేస్ లో అంజలి యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ఝాన్సీ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (19:52 IST)
anjali-jhansi
అంజలి ప్రధాన పాత్రలో నటించి ఇటీవలే ఓటీటీ లవర్స్ ముందుకొచ్చింది వెబ్ సిరీస్ ఝాన్సీ. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు. సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ గత నెల 27 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో అంజలి యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె చేసిన స్టంట్స్ ప్రత్యేక ఆకర్షణ అయ్యాయి. అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
 
ఇటీవల విడుదలైన ఓటీటీ షోస్ రేటింగ్స్ లో ఝాన్సీ సెకండ్ ప్లేస్ ను సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ కు 3.25 మిలియన్ యూనిక్ వ్యూయర్స్ తో 0.66 రీచింగ్ సాధించింది. ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ స్టంట్ కొరియోగ్రాఫర్ యనిక్ బెన్ ఝాన్సీ వెబ్ సిరీస్ లో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. ఒక సరికొత్త యాక్షన్ డ్రామాగా ఝన్సీ సూపర్ సక్సెస్ సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments