మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా లీక్ అయిన ఫోటోల అనుసారం ఈమె రామ్ చరణ్ కి భార్య పాత్రలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రాబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అంజలి చాలా సన్నబడింది.
అంతే కాకుండా చాలా అందంగా కూడా తయారైంది అని ఆమె ఎప్పుడు ఫొటోస్ షేర్ చేసినా అనిపిస్తుంది. తాజాగా మరోసారి ఈ ఫోటో ఆమె షేర్ చేసింది. రాజమండ్రిలో ప్రస్తుతం జరుగుతున్న రామ్ చరణ్ శంకర్ ల సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న సందర్భంగా అంజలి ఈ ఫోటో తీసుకొని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఈ ఫోటోలో అంజలి సన్నబడింది. రెండు మూడు సంవత్సరాల క్రితం అంజలి చాలా బొద్దుగా ఉండేది కానీ ఇప్పుడు ఆమె చాలా అందంగా సన్నగా నాజూకుగా మారింది అందంగా మారడం కోసం సన్నగా అవ్వడం కోసం ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
వర్కౌట్ చేయడంతో పాటు పని కట్టుకుని డైట్ పాటించింది. అందుకు ఫలితం తప్పకుండా ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.