Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెళ్లి గురించి మీకెందుకండీ అంత తొందర? ఉంటే నేనే చెబుతా కదా అంటున్న అంజలి

నటి అంజలికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని అంజలి ఖండించారు. తనకిప్పుడే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (05:09 IST)
చిన్న గ్యాప్‌ తరువాత నటి అంజలి మరోసారి వార్తల్లోకెక్కారు. తమిళం, తెలుగు భాషల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటి ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ఆ మధ్య పిన్నితో మనస్పర్థలు, దర్శకుడు కళంజంతో వివాదాలు అంటూ కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన అంజలి కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. అలాంటిది తాజాగా ఈ అమ్మడి పేరు మీడియాలో చర్చనీయంశంగా మారింది. నటుడు జయ్‌తో ప్రేమ కలాపాలు అంటూ చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది.
 
ఇటీవల జయ్‌ స్వయంగా దోసెలు వేసి అంజలికి పెట్టడం, వాటిని ఆమె కమ్మగా ఆరగించడం వంటి దృశ్యాలు మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీంతో మరోసారి ఈ సినీ జంట ప్రేమ వ్యవహారం హాట్‌హాట్‌గా మారింది. చిన్న గ్యాప్‌ తరువాత అంజిలి తమిళంలో నటిస్తున్న చిత్రం బెలూన్‌. ఇందులో జయ్‌ కథా నాయకుడు. ఈ చిత్రంలో నటి అంజలికి సంబందించిన సన్నివేశాలు పూర్తి కావడంతో తను చిత్ర యూనిట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఐ లవ్‌ యూ అంజలి అంటూ జయ్, సంతోషకరమైన సమయం మళ్లీ వస్తుంది అని అంజలి ఒకరికొకరు ట్వీట్‌ చేసుకోవడం వారి మధ్య ప్రేమకు అద్దం పడుతుందని చెప్పవచ్చు.
 
ఇలాంటి పరిస్థితుల్లో నటి అంజలికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని అంజలి ఖండించారు. తనకిప్పుడే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇంకా తను చెబుతూ ఒకేసారి పలు చిత్రాల్లో నటించాలనే ఆశ తనకు లేదని, నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
చిత్రంలో తన పాత్ర గురించి అందరూ చెప్పుకోవాలన్నారు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్నాయని, అందువల్ల తన దృష్టి అంతా నటనపైనే సారిస్తున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదని, అలాంటిదేదైనా ఉంటే కచ్చితంగా అందరికీ చెబుతానని అన్నారు. ప్రస్తుతం తన సోదరుడికి వధువును వెతికే పనిలో ఉన్నట్లు అంజలి చెప్పారు .
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

గుంటూరు మిర్చి యార్డ్ విజిట్: ఏపీ సర్కారు రైతులకు "శాపం"గా మారింది.. జగన్ (video)

పూణేలో జీబీఎస్ పదో కేసు.. 21 ఏళ్ల యువతి కిరణ్ చికిత్స పొందుతూ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments