Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు సీమ చిన్నోడు.. రేపు సాఫ్ట్‌వేర్ బుల్లోడు. త్రివిక్రమ్‌తో పవన్ కల్యాణ్ జోడీ

అత్తారింటికి దారేది? ఒక్కసినిమాతో పవన్ కల్యాణ్ చరిత్రనే కాదు... టాలివుడ్ కలెక్షన్ల చరిత్రను కూడా మార్చేసిన అద్వితీయ దర్శకుడు త్రివిక్రమ్.. కుటుంబ బంధాల మాధుర్యాన్ని విడిపోయిన కుటుంబం సాక్షిగా అల్లి కళ

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (02:02 IST)
అత్తారింటికి దారేది? ఒక్కసినిమాతో పవన్ కల్యాణ్ చరిత్రనే కాదు... టాలివుడ్ కలెక్షన్ల చరిత్రను కూడా మార్చేసిన అద్వితీయ దర్శకుడు త్రివిక్రమ్.. కుటుంబ బంధాల మాధుర్యాన్ని విడిపోయిన కుటుంబం సాక్షిగా అల్లి కళ్లముందు ఒక దృశ్య అద్బుతాన్ని సృష్టించిన అపరూప చిత్రం అత్తారింటికి దారేది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్- పవన్ కల్యాణ్ జోడీ మళ్లీ కలుస్తోంది. సాఫ్ట్‌వేర్ సీమలో దారులెతుక్కుంటున్న బుల్లోడుగా పవన్ కొత్త గెటప్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
 
రాయలసీమ నుంచి రావడమే ఆలస్యం హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పవన్‌కల్యాణ్‌ జాయిన్‌ కానున్నారట! పవన్‌కు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అవసరం ఏముంది అని ఆలోచిస్తున్నారా! ఆయనలోని హీరోకి అవసరమే మరి. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.
 
అందులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసే ఐటీ ఎనలిస్ట్‌గా పవన్‌ కనిపిస్తారట! ఏప్రిల్‌ తొలి వారంలో త్రివిక్రమ్‌ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. ‘కాటమరాయుడు’లో పవన్‌ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పంచెకట్టులో ఆయన లుక్‌ అభిమానులకు మాంచి కిక్‌ ఇచ్చింది. 
 
ఈ లుక్‌కి పూర్తి భిన్నంగా త్రివిక్రమ్‌ సినిమాలో లుక్‌ ఉంటుందట. సై్టలిష్‌ అండ్‌ ట్రెండీగా కనిపిస్తారట. డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్‌ వేడుకను ఈనెల 18న నిర్వహించి, 24న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments