Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ని ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారు... పీపుల్ స్టార్ వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:51 IST)
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం.. కేసీఆర్ రెండోసారి సీఎం అవ్వ‌డం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పైన సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు సాయంత్రం సూప‌ర్ స్టార్ కృష్ణ కేసీఆర్‌ని అభినందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అయితే.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ.. కేసీఆర్‌ని అభినందించింది. సినీ ప్ర‌ముఖులు కొంతమంది ప‌ర్స‌న‌ల్‌గా మ‌రి కొంతమంది సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని కేసీఆర్‌ని అభినందిస్తున్నారు. 
 
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ మూర్తి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన అనంతరం నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నరేళ్ల పాలన చూసి టీఆర్ఎస్‌ను 88 స్థానాల్లో ప్రజలు గెలిపించారని, ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్ నడుస్తోందని అన్నారు. ప్రజలకు అమోఘమైన పాలన అందించాలని కేసీఆర్‌ని కోరానని, భారత రాజకీయాల్లో కూడా ఆయన సేవల అవసరం ఉందని.. కేసీఆర్‌ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తార‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments