Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్నకు ఆ పిచ్చి వుండేది.. అనసూయ భరద్వాజ్

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (11:16 IST)
బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా అనసూయ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె జీవితంలో చోటుచేసుకున్న కొన్ని విషయాలను వెల్లడించింది. అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి ఇది వరకే ఎన్నో సార్లు స్ఫష్టంగా చెప్పారు. 
 
అమ్మానాన్నలు, చెల్లెళ్లు, భర్త గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. అనసూయ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చారు. అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని, డబ్బులు సరిపోకపోతే బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అని అనసూయ వివరించారు.
 
అంతేకాకుండా తన తండ్రి గురించి చెబుతూ తమను ఎలా పెంచారో కూడా చెప్పుకొచ్చారు. స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేవారని, ఆటో వాళ్లతో ఎలా మాట్లాడుతామో, ఎలా హ్యాండిల్ చేస్తామో అని దూరం నుంచి ఓ కంట కనిపెడుతుండే వారని ఆ మధ్య అనసూయ చెప్పుకొచ్చారు. 
 
"మేం రిచ్‌గానే పెరిగాం. ఈ విషయం ఇంత వరకు ఎక్కడా చెప్పలేదు. మాకు గుర్రాలు ఉండేవి.. మా నాన్నకు హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ పిచ్చి కూడా ఉండేది.. అలా మా ఆస్తిపోయింది" అంటూ అనసూయ చెప్పుకొచ్చారు.
 
అనసూయ ఇప్పుడు ఐదారు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ అంటూ బిజిబిజీగా తిరుగుతున్నారు. రేపు థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాతో ఆహాలో అనసూయ సందడి చేయబోతోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments