Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయపై ‘మెగా’ ఆఫర్లు వర్షిస్తున్నాయా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (18:23 IST)
అనసూయ.. నిన్నమొన్నటి దాకా బుల్లితెరకే పరిమితమైన ఒక యాంకర్. ఈటీవీలో 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌తో తెలుగునాట పాపులర్ అయిపోయిన ఈ అమ్మడు ఇప్పుడు వెండితెరపై కూడా తన హవాని కొనసాగిస్తోంది.


నాగార్జున ద్విపాత్రాభినయంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా'తో సిల్వర్ స్క్రీన్‌పై ఒక మెరుపు మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో కీలక పాత్రల్లోనూ నటించేసి తనదైన ముద్రని వేసేసింది.
 
'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నటించిన తర్వాత 'క్షణం', 'గాయత్రి' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన అనసూయకి.. 'రంగస్థలం'లో పోషించిన రంగమ్మత్త పాత్ర ఎక్కడ లేని గుర్తింపుని తీసుకువచ్చేసింది. 
 
కాగా... ఇప్పుడు ఆ పాత్రే అనసూయకి పలు అవకాశాలను కల్పించే వేదికగా నిలుస్తోంది. అక్కడితో ఆగకుండా ఒకవైపు కీలక పాత్రలు చేస్తూనే మరో వైపు పాటల్లోనూ తన గ్లామర్‌తో మురిపిస్తోన్న అనసూయ... అవకాశం దొరికినప్పుడల్లా... ప్రధాన పాత్రల్లో కూడా కొన్ని సినిమాలు చేస్తోంది. 
 
2017లో విడుదలైన సాయి ధరమ్ తేజ్ 'విన్నర్'లో ఐటమ్ సాంగ్‌తో సందడి చేసిన అనసూయ.. గత ఏడాది రామ్ చరణ్ 'రంగస్థలం'లోనూ.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వరుణ్ తేజ్ చిత్రం 'ఎఫ్ 2'లోనూ కీలక పాత్రల్లో కనిపించింది. అంటే ఏడాదికో మెగా హీరో సినిమాలో అనసూయ దర్శనమిస్తోందన్నమాట. 
 
అంతేకాకుండా త్వరలో మరో ఇద్దరు మెగా హీరోలతోనూ అనసూయ కలసి నటించే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు షికార్లు చేస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోనూ, అలాగే అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న సినిమాలోనూ అనసూయకి కీలక పాత్రలు దక్కాయనే సమాచారం ఇప్పుడు జోరందుకుంటోంది. 
 
మొత్తం మీద ఈ టాక్ నిజమైనట్లయితే... ఏడాదికో మెగా హీరోతో సినిమా చేస్తూ వస్తున్న అనసూయ.. వచ్చే ఏడాది ఏకంగా ఇద్దరు మెగా హీరోలతో సందడి చేసే అవకాశం ఉందనే అనిపిస్తోంది.

మరి ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలలోనూ తనదైన ముద్ర వేసిన అనసూయ చిరంజీవి మరియు అల్లు అర్జున్ సినిమాలలో ఏ విధంగా తళుక్కుమనబోతోందో వేచి చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments