Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగస్థలం సుకుమార్ ''పుష్ప"లో రంగమ్మత్త..!

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (12:34 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమా‌లో యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు బన్నీ.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. దేవీశ్రీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. అనసూయ లీడ్‌ రోల్‌ చేసిన 'థ్యాంక్యూ.బ్రదర్‌' సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 
 
ఈ నేపథ్యంలో పుష్పలో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది అనసూయ. వివరాల్లోకి వెళితే.. బుల్లితెరపై యాంకర్‏గా చేస్తూనే.. అటూ వెండితెరపై తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంటోంది జబర్ధస్థ్ బ్యూటీ అనసూయ. అప్పటివరకు టెలివిజన్ యాంకర్‏గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత అక్కినేని ప్రధాన పాత్రలలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగ స్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో ఒక్కసారిగా అనసూయ రేంజ్ మారిపోయింది. 
 
తాజాగా మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోంటుంది అనసూయ. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మంచి రోజులు ముందున్నాయి. మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అనసూయ రవితేజ 'ఖిలాడి', కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న 'రంగమార్తాండ' చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments