Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆంటీ" ట్రోల్స్‌పై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన అనసూయ

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (09:09 IST)
బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ మరోమారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయంచారు. తనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు "ఆంటీ" అంటూ ట్రోల్స్ చేయడంతో ఆమె మండిపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు కాపీని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
పనిలోపనిగా కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఆమె థ్యాంక్స్ చెప్పారు. తన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించి తనకు మద్దతు ఇచ్చారంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫిర్యాదు కాపీని ట్విట్టర్‌లో షేర్ చేసిన అనసూయ... #SayNoToOnlineAbuse #StopAge Shaming అనే రెండు హ్యాష్ ట్యాగ్‌లను జతచేశారు. 
 
కాగా, తాజాగా విడుదలైన ఓ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీనిపై అనసూయ కామెంట్స్ చేస్తూ.. "అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ... కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా" అని ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో అనసూయపై దాడికి దిగారు. 
 
ముఖ్యగా, ఫ్లాప్ అయిన సినిమా హీరో అభిమానులు విరుచుకుపడ్డారు. తమకు తోచిన కామెంట్స్, మీమ్స్‌తో ఆడేసుకున్నారు. మరికొందరు అయితే "అంటీ" అంటూ అవమానపరిచారు. వీటిని తట్టుకోలేని అనసూయ ఇపుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments