Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ సూపర్ సీన్ చిత్రీకరించిన తర్వాత చెర్రీతో తీసిన సెల్ఫీ ఇదే- జబర్దస్త్ అనసూయ

రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 1985 నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించ

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (12:59 IST)
రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 1985 నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతికి విడుదల చేయనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సంక్రాంతి పండుగ వాతావరణం ఉట్టిపడేలా టీజర్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో రంగస్థలం సెట్స్ నుంచి యాంకర్ అనసూయ తీసిన సెల్ఫీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జబర్దస్త్ యాంకర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోలో చెర్రీతో కలిసి అనసూయ, వాళ్లబ్బాయి సెల్ఫీ దిగారు. 

అద్భుతమైన వ్యక్తి చెర్రీతో దిగిన సెల్ఫీని మీతో షేర్ చేసుకుంటున్నానని కామెంట్స్ చేసింది. అంతేగాకుండా ఓ అద్భుతమైన సన్నివేశాన్ని చిత్రీకరించిన అనంతరం, 'రంగస్థలం' సెట్స్‌లో దిగిన సెల్ఫీ ఇదని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా అనసూయ రంగస్థలంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెర కనిపిస్తూనే సినిమాల్లోకి వచ్చిన అనసూయ.. సచ్చింది గొర్రె అనే చిత్రంలో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments